![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1008 లో....రేఖకి రాజు ఫోన్ చేసి కోటి రూపాయలు కావాలని డిమాండ్ చేస్తాడు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడ నుండి తీసుకొని వస్తానని రేఖ అనగానే అయితే సరదాగా మీ అమ్మాయి చేతివేళ్ళు కట్ చేసి పంపిస్తున్నానని రాజు అనగానే అయ్యో మా ఇందు సంతకం ఎలా పెడుతుందని భ్రమరాంబ అంటుంది. రాజు ఫోన్ మాట్లాడతుంటే నందు ఫోన్ ట్రేస్ చేస్తుంది. ఇంకా కాసేపు మాట్లాడమని రేఖతో నందు చెప్తుంది. కోటి రూపాయలు సేట్ చెయ్యడానికి నాకు రెండు రోజులు టైం కావాలని అంటుంది. అలా అన్నావ్ బాగుంది.. నేను మళ్ళీ కాల్ చేసి ఎక్కడికి తీసుకొని రావాలో చెప్తానని రాజు ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పుడు మనకి కోటి ఎవరు ఇస్తారని రేఖతో భూషణ్ అంటాడు. ఎలా అయిన సెట్ చెయ్యాలని రేఖ అంటుంది. లొకేషన్ అయితే ట్రేస్ చేసాం.. అక్కడికి వెళ్లి వెతకాలని నందు అంటుంది.
మరొకవైపు హమ్మయ్య కోటి రూపాయలు వచ్చాక అన్నీ పోగా నలభై లక్షలు ఉంటాయి. మంచి బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవాలని రాజుతో లక్కీ అంటాడు. అలాకాదురా బిజినెస్ లో పెట్టి రెట్టింపు చెయ్యాలని రాజు అంటాడు. ఎవరో డోర్ కొడుతున్నారని వెళ్లి లక్కీ చూస్తాడు. తీరా చూస్తే పోలీసులు వస్తారు. వాళ్ళని చూసి కిడ్నాప్ గురించి తెలిసిపోయిందా ఏంటని ఇద్దరు టెన్షన్ పడుతారు. ఏంటి సర్ ఇలా వచ్చారని రాజు అడుగుతాడు. ఒక దొంగ పారిపోయి ఇటు వైపే వచ్చాడని ఇన్‌స్పెక్టర్ అంటాడు. ఎవరు రాలేదని లక్కి అంటాడు. అప్పుడే ఇందు లోపల నుండి బయటకు వస్తుంది. ఎవరు ఈ అమ్మాయి అని ఇన్‌స్పెక్టర్ అడుగగా ఈ అమ్మాయి వీడు భార్యాభర్తలు అని లక్కీ అంటాడు. దాంతో ఇందు కోప్పడుతుంటే.. ఏంటి సిస్టర్ ఎన్ని గొడవలు ఉంటే మాత్రం ఇలా మాట్లాడాలా.. మిమ్మల్ని కన్విన్స్ చేసి కలపడానికే కదా వచ్చానని లక్కీ అంటాడు. ప్లీజ్ ఏం మాట్లాడకని ఇందుకి లక్కీ సైగ చేస్తాడు. ఫ్రెండ్ అంటే మీలాగా ఉండాలని ఇన్‌స్పెక్టర్ లక్కీని మెచ్చుకుంటాడు. ఇన్‌స్పెక్టర్ వాళ్ళు బయటకు వెళ్తారు. వాళ్ళ కార్ దగ్గర నందు, వెంకీ ఎదురుపడతారు. ఇందు అక్క కిడ్నప్ అయింది వెతుకుతున్నామని నందు అంటుంది. ఒకసారి ఫోటో చూపించు నాకు కన్పిస్తే చెప్తానని ఇన్‌స్పెక్టర్ అంటాడు. నందు చూపిస్తుంటే అప్పుడే ఇన్‌స్పెక్టర్ కి ఫోన్ వచ్చి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత నేను వాడి భార్యనా.. ఏంటి ఎందుకు అలా చెప్పావని లక్కీపై ఇందు కోప్పడుతుంది. నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావ్ మరి అలా చెప్పినప్పుడు.. ఇప్పుడు నీక్కూడా అవసరం ఉంది.. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే ప్రాబ్లమ్ అని రాజు అంటాడు. నన్ను ఇప్పుడు బయటకు పంపిస్తే మీకు ఎంత డబ్బు కావాలన్న ఇస్తాను.. నేను దుగ్గిరాల ఇంటికి వారసురాలిని.. స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ కి కాబోయే చైర్మన్ ని అని ఇందు అంటుంది. నువ్వు అయినప్పుడు కదా అని ఇందుని లోపలికి పంపించి బయట నుండి గడియ వేస్తారు రాజు, లక్కీ. ఆ తర్వాత రాజు, లక్కీ ఉన్న దగ్గరికి నందు, వెంకీ వస్తారు. ఆ అమ్మాయితో మీ తమ్ముడు వచ్చాడు ఏంటి.. కొంపదీసి మనం కిడ్నాప్ చేసిన దాని గురించి తెలిసిపోయిందా అని లక్కీ అంటాడు. తరువాయి భాగంలో రాజు, లక్కీ పడుకున్నాక ఇందు దగ్గరికి నందు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |